బ్యాంకుల రేటింగ్‌కు సానుకూలం: ఫిచ్‌

27 Oct, 2017 00:44 IST|Sakshi

ముంబై: బ్యాంకులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళిక– బ్యాంకుల రేటింగ్‌కు సానుకూల అంశమని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.

బ్యాంకుల మూలధన అవసరాలను నెరవేర్చడంలో తాజా ప్రణాళిక ఎంతో కీలకమైనదని నివేదిక వివరించింది. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ బాసెల్‌–3 ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌ బ్యాంకింగ్‌కు 2019 మార్చికి 65 బిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని గత నెల్లో ఫిచ్‌ అంచనావేసిన సంగతి తెలిసిందే.  

ద్రవ్యలోటుపై ఎఫెక్ట్‌...
రీక్యాపిటలైజేషన్‌ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తే, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావితం చూపే వీలుందని ఫిచ్‌ అంచనా వేసింది.

ప్రభుత్వానికి వచ్చీ–పోయే ఆదాయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.2 శాతం ఉండాలన్న లక్ష్యాన్ని బడ్జెట్‌ నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే జరిగితే వేరే రంగంలో వ్యయ కోతలు జరిగే వీలుందని సైతం నిర్దేశించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు