లాభాలతో ప్రారంభం : బ్యాంకుల జోరు

18 Mar, 2019 09:11 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. గతవారమంతా భారీ లాభాలతో  కొనసాగిన కీలక సూచీలు  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఈ వారం ఆరంభంలోనే  ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. సెన్సెక్స్‌ 283 పాయింట్లు ఎగియగా, నిప్టీ 83 పాయింట్లు లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే. మైండ్‌ ట్రీ సంస్థ కోఫౌండర్‌ సుబ్రతో బాగ్జీ నిర్ణయంతో మైండ్‌ట్రీ, మారుతి, టాక్స్‌డిమాండ్‌ నోటిసు కారణంగా గ్రాసిం సిమెంట్స్‌ భారీగా నష్టపోతున్నాయి. ఇంకా వేదాంత, ఎన్‌టీపీసీ , సన్‌ ఫార్మ , లూపిన్‌ నష్టపోతున్నాయి.  ఐవోసీ, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, కోటక్‌ మహీంద్ర, బీపీసీఎల్‌, ఇండియా బుల్స​ హౌసింగ్‌ భారీగా లాభపడుతున్నాయి.

మరోవైపు  దేశీయ కరెన్సీ లాభాలలో ప్రారంభమైంది. దీంతో ఐటీ బలహీనంగా ఉండగా, బ్యాంకింగ్‌ సెక్టార్‌ లాభపడుతోంది. తద్వారా బ్యాంక్‌ నిఫ్టీ తన జోష్‌ను కొనసాగిస్తోది.  దీంతో నిఫ్టీ 11500 స్థాయికి చేరింది. 

అటు చైనాతో వాణిజ్య వివాద ఒప్పందం కుదరనున్న అంచనాలతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. బ్రెక్సిట్‌పై అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ యూరోపియన్‌ మార్కెట్లు  లాభపడ్డాయి. ఇక మరోవైపు వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం లాభాల ర్యాలీ  అయ్యాయి. ఆసియా మార్కెట్లది ఇదే ధోరణి. 

మరిన్ని వార్తలు