న్యాక్‌తో పవర్‌ గ్రిడ్‌ ఎంవోయూ

5 Jun, 2018 00:41 IST|Sakshi

తెలంగాణ యువత ఉపాధి లక్ష్యం..

పవర్‌ గ్రిడ్‌కు చెందిన సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌–1 (ఎస్‌ఆర్‌టీఎస్‌–1) తాజాగా నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)తో ఒక ఎంవోయూ కుదుర్చుకుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా తెలంగాణలోని 390 మంది యువతకు ఉపాధి కల్పనే ఈ ఎంవోయూ లక్ష్యం.

ఇందులో భాగంగా పవర్‌ గ్రిడ్‌ తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.1.1 కోట్లను అందిస్తే.. న్యాక్‌ తనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 కేంద్రాలలో ల్యాండ్‌ సర్వేయర్, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్, వెల్డింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, టైలరింగ్‌ వంటి పలు విభాగాల్లో శిక్షణనిస్తుంది. ఎస్‌ఆర్‌టీఎస్‌–1 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.శేఖర్, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.బిక్షపతి ఎంవోయూను మార్చుకున్నారు. న్యాక్‌ డైరెక్టర్లు, పవర్‌ గ్రిడ్‌ సీనియర్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు