ఈ 2 ఫైనాన్స్‌ షేర్లకు మోతీలాల్‌ ఓస్వాల్‌ బుల్లిష్‌ రేటింగ్‌

19 May, 2020 14:35 IST|Sakshi

ప్రముఖ బ్రోకరేజ్‌ మోతీలాల్‌ ఓస్వాల్‌ పైనాన్షియల్‌ షేర్లపై ‘‘బుల్లిష్‌’’ వైఖరిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. ఈ రెండు షేర్లపై బ్రోకరేజ్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా సమగ్ర నివేదికను ఇప్పుడు పరిశీలిద్దాం...

ప్రస్తుత మార్కెట్‌ వాతావరణంలో ఫైనాన్స్‌ రంగ షేర్లు ప్రదర్శన అంత బాగాలేదు. ఇటీవల స్థూల ఆర్థికవ్యవస్థలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు ఫైనాన్స్‌ రంగంలో అధిక స్లిపేజ్‌లు, రుణ వ్యయాలకు దారితీశాయి. ఇంతకు ముందు కార్పోరేట్‌ ఎన్‌పీఏలు పెరగడం.. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఫైనాన్స్‌ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలు ఎన్‌బీఎఫ్‌సీలు, మధ్య స్థాయి బ్యాంకులకు అధిక ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉంటాయని సిద్ధార్థ నివేదికలో పేర్కోన్నారు. 

ధీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు మధ్య స్థాయి బ్యాంకులు, ఎన్‌బీఎబీఎఫ్‌సీలతో పోలిస్తే ఈ రంగంలో పెద్ద బ్యాంకులుగా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు బ్యాంకులపై ఎక్స్‌పోజర్ల ఒత్తిడి స్వల్ప కాలానికే పరిమితమయ్యే ఆస్కారం ఉంది. ఒకటి లేదా రెండు క్వార్టర్లో మాత్రమే షేర్లపై  ఎక్స్‌పోజర్ల ఒత్తిడి ఉండవచ్చు. అలాగే ఆస్తి నాణ్యత, అధిక స్లిప్పేజీలు మాత్రమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో మనుగడ కోసం అదనపు మూలధనాన్ని సమీకరించుకోగలవు. కాబట్టి మేము ఈ రంగంలో ప్రధాన షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌లను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా