'స్మార్ట్ మిషన్'లో ప్రైవేట్ రంగమే కీలకం

25 Apr, 2016 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ : మనదేశంలో   ప్రభుత్వం రంగంతో పాటు, ప్రైవేట్ రంగానికి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో   స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రైవేట్ రంగమే కీలక పాత్ర పోషించ నుందని సర్వేలు తేల్చి చెప్పాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ప్రైస్ వాటర్ హౌస్ కార్పొరేషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు, మున్సిపల్ సర్వీసులు కల్పించకపోతే పట్టణ ప్రాంతాల వృద్ధి జరదని సర్వేలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, అర్బన్ స్థానిక సంస్థలకు మౌలిక సదుపాయాలు  కల్పిస్తూ ఎక్కడైనా సమస్య వచ్చినా సహాయ పడటంలో ప్రైవేటు రంగం కీలకపాత్ర పోషిస్తుందని సర్వేలు  చెబుతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా 2050 ఏడాది వరకు పట్టణ జనాభా 66 శాతం పెరుగుతుందని, దీనిలో భారత్ పాత్రే ఎక్కువగా ఉంటుందని చెప్పాయి. భారత్ లో పట్టణ జనాభా దాదాపు 410 మిలియన్. ఇది మొత్తం జనాభాకు 32 శాతం. అయితే ఈ జనాభా 2050 కల్లా 814 మిలియన్ కు లేదా ప్రపంచ జనాభాలో సగానికి కన్నా చేరుకుంటుందని ఈ సర్వేలు అంచనావేస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్రప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలు, 500 సిటీలను అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సిమిషన్ కింద ఎంపిక చేసిందని పేర్కొన్నాయి. ఈ సిటీల రూపకల్పనలో  ప్రైవేట్ రంగం ఎంతో సహాయం అందిస్తుందని సర్వేలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు