బ్యాంక్‌ నిఫ్టీ వీక్‌- ఈ చిన్న బ్యాంకులు భేష్‌

4 Jun, 2020 14:39 IST|Sakshi

ట్రెండ్‌కు ఎదురీదుతున్న బ్యాంక్‌ కౌంటర్లు

జాబితాలో ఐడీబీఐ, యూనియన్‌, ఐవోబీ

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 2 శాతం డౌన్‌

ఆటుపోట్ల మధ్య స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. అయితే తొలుత అమ్మకాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లు టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. అయినప్పటికీ ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 2 శాతం క్షీణించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

ట్రేడింగ్‌ పరిమాణం
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు..  ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ సింద్‌, యూనియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ 8-1.3 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో భారీ ట్రేడింగ్‌ పరిమాణం నమోదవుతోంది.

జోరు తీరిలా
ఐవోబీ కౌంటర్లో గత నెల రోజుల ట్రేడింగ్‌ సగటు బీఎస్‌ఈలో 1.46 లక్షల షేర్లుగా నమోదుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.01 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంక్‌ కౌంటర్‌ సగటు 6.45 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 10.06 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇక యూనియన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సగటు 7.91 లక్షల షేర్లుకాగా.. 10.35 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కాగా.. ఇండ్‌బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌  సర్వీసెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 7.70 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ సగటు పరిమాణం 11,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 1.2 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు