ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్‌ బూస్ట్‌

21 Feb, 2019 11:04 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు తాజాగా పెట్టుబడులను సమకూర్చనుంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు భారీగా లాభపడుతున్నాయి. దీంతో ఊగిసలాట మార్కెట్‌కు  ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు భారీ మద్దతునిస్తున్నాయి. మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం రూ. 48,239 కోట్ల పెట్టుబడులను సమకూర్చేందుకు తాజాగా నిర్ణయించింది.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

 బ్యాంకులు - పెట్టుబడుల వివరాలు 
ప్రభుత్వం పెట్టుబడులు సమకూరుస్తున్న బ్యాంకులలో అలహాబాద్‌ బ్యాంక్‌కు రూ. 6896 కోట్లు
కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ. 9086 కోట్లు 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 4638 కోట్లు
బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్రకు రూ. 205 కోట్లు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 5098 కోట్లు
యూనియన్ బ్యాంక్‌కు రూ. 4112 కోట్లు
ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 3256 కోట్లు
సిండికేట్‌ బ్యాంకుకు రూ. 1603 కోట్లు
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 2560 కోట్లు
యునైటెడ్‌ బ్యాంక్‌కు రూ. 2839 కోట్లు 
యుకో బ్యాంక్‌కు రూ. 3330 కోట్లు
ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌కు రూ. 3806 కోట్లు సమకూర్చనుంది. 

అలహాబాద్‌ బ్యాంక్‌ షేరు 6 శాతం జంప్‌ చేయగా కార్పొరేషన్‌ బ్యాంక్‌ 16 శాతం లాభపడుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 5 శాతం, ఆంధ్రా బ్యాంక్‌ 5.5 శాతం, పీఎన్‌బీ 3.2 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2.3 శాతం పుంజకున్నాయి. ఇంకా సెంట్రల్‌ బ్యాంక్‌ 5.6 , యునైటెడ్‌ బ్యాంక్‌ 7 శాతం, యుకో బ్యాంక్‌ 7శాతం , ఐవోబీ 7.3 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ దాదాపు 3 శాతం  లాభాలతో కొనసాగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు