ప్రభుత్వ బ్యాంకులకు మరింత క్యాపిటల్‌ కావాలి

19 Aug, 2017 13:22 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత పెట్టుబడుల అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. శనివారం ముంబైలో నిర్వహించిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌  బ్యాంక్రప్సీ జాతీయ సదస్సులో ఆయన  మాట్లాడారు. బ్యాలెన్స్ షీట్ల భారాన్ని తగ్గించుకునేందుకు  ఈ భారీ రీకాపిటలైజేషన్ అవసరమవుతుంది.

నగదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్ద మొత్తంలో రీకాపిటలైజేషన్ అవసరమవుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌   పటేల్‌ చెప్పారు. అదనపు నిధులు కావాలన్నారు.   మార్కెట్ నుంచి నిధులను సమీకరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను తగ్గించడంతో పాటు పలు రంగాల్లో అదనపు  క్యాపిటల్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా ఇది అధిక నిష్పత్తిలో కొనసాగుతోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్‌పీఏ నిష్పత్తి 9.6 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని   వివిధ బ్యాంకర్లు  పారిశ్రామికవేత్తలు  హాజరైన ఈ సమావేశంలో తెలిపారు. అలాగే బ్యాంకుల  బ్యాడ్‌ లోన్ల సమస్య పరిష్కరించేందుకు హెయిర్‌ కట్‌ అవసరం  పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు