పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

11 Oct, 2019 06:09 IST|Sakshi

ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుతో సానుకూలత

న్యూఢిల్లీ: గత నెలలో ఆర్‌బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్‌ విభాగం, ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్‌ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్‌ ఇండియా సైతం ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్‌ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్‌ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్‌ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్‌ఈ రుణ రేట్లు 8.95–9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ సైతం ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు వడ్డీ తగ్గింపు
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు (పీపీబీ) సేవింగ్స్‌ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేటును అర శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. నవంబర్‌ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పీపీబీ ప్రకటించింది. ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర తగ్గించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పీపీబీ సీఈవో, ఎండీ సతీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. 7.5 శాతం వడ్డీ రేటుతో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని కూడా పీపీబీ ప్రకటించింది. పీపీబీ భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ద్వారా ఈ వడ్డీ రేటు పొందొచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

ఇండస్‌ఇండ్‌ లాభం రూ.1,401 కోట్లు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

కోపరేటివ్‌ బ్యాంకులకు చికిత్స!

అంచనాలు అందుకోని టీసీఎస్‌

జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

పీఎంసీ స్కాం: భిక్షగాళ్లుగా మారిపోయాం

విస్తారా పండుగ సేల్‌: 48 గంటలే..

నష్టాల్లో మార్కెట్లు : టెల్కో జూమ్స్‌

కొత్త ‘టిగోర్‌ ఈవీ’ వచ్చింది...

దూసుకొచ్చిన ‘డ్రాగ్‌స్టర్‌’ కొత్త బైక్స్‌

ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనానికి ఆర్‌బీఐ నో

పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌

శరత్‌ మ్యాక్సివిజన్‌ విస్తరణ

భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

బుల్‌.. ధనాధన్‌!

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే!

ఉద్యోగులకు తీపికబురు

మదీనాగూడలో రిలయన్స్‌ జూవల్స్‌ షోరూం ప్రారంభం

భారీ లాభాల్లోకి  సూచీలు, బ్యాంక్స్‌ అప్‌

ఎంఐ ఫాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్: బంపర్‌ ఆఫర్‌

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌

రూ. 10 వేల కోట్ల సమీకరణలో ఓయో

ఫ్లాట్‌ ప్రారంభం : యస్‌ బ్యాంకు ఢమాల్‌

మైక్రోసాఫ్ట్‌కు ‘యస్‌’..?

ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డిజిటల్‌ ఎంట్రీ

ఆర్డీఎక్స్‌ లవ్‌ హిట్‌ కావాలి

పంచ్‌ పడుద్ది

డిష్యుం డిష్యుం

ప్రేమంటే ప్రమాదం

విద్యార్థుల సమస్యలపై పోరాటం