ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షకు పైగా ఉద్యోగాలు

17 Dec, 2018 18:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. అతిపెద్ద  ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా,  బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్షలాదిమందిని నియమించుకోనున్నాయని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఎనలిటిక్స్‌, స్ట్రాటజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌,  కస్టమర్స్‌ సర్వీసెస్‌  విభాగాల్లో  అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని సమాచారం.

టీమ్ లీజ్ అంచనాల ప్రకారం గత రెండేళ్లో చేపట్టిన నియమాకాల కంటే రెట్టింపు కన్నా ఎక్కువే. గత రెండు సంవత్సరాలలో బ్యాంకులు  గుమస్తా, మేనేజ్మెంట్ ట్రైనీలు, ప్రొబేషనరీ ఆఫీసర్ల కేటగిరీలో దాదాపు 95వేల మందిని నియమించుకున్నాయి. మొండి బకాయిలతో కుదేలైన  ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇపుడు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఆర్థిక సేవల నిర్వహణా తీరును, కల్చర్‌ను మార్చుకుంటున్నాయనీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, మొండి బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు ప్రైవేటు/ బహుళజాతి బ్యాంకులకు ధీటుగా వీరికి వేతనాలను ఆఫర్‌ చేయనున్నాయని సిండికేట్ బ్యాంక్ సీఈవో  మృత్యుంజయ్‌ మహాపాత్ర వ్యాఖ్యలను ఉటింకిస్తూ మీడియా రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో సిండికేట్‌ బ్యాంకు  ఈ ఆర్థిక సంవత్సరంలో 500మందిని  నియమించుకోనుంది.

మరిన్ని వార్తలు