ఫైవ్ స్టార్ వసతిలో ఆ నగరమే టాప్

23 May, 2016 10:17 IST|Sakshi

ముంబై : భారత పర్యటకులు తక్కువ ధరలకే ఫైవ్ స్టార్ హోటల్ లో వసతి సదుపాయం పొందుతున్న నగరంగా మహారాష్ట్ర సాంస్కృతిక రాజధాని పుణే టాప్ లో నిలిచింది. సగటు ధర రూ.7,602లకే ఒక రాత్రి ఐదు నక్షత్రాల హోటల్ లో బసచేసే అవకాశం లభిస్తుందట. తాజా హోటల్ ధర ఇండెక్స్(హెచ్ పీఐ) రిపోర్టులో పుణేకి టాప్ ప్లేస్ వరించింది.


ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన స్థలాల్లో హోటల్ ధరలపై రిపోర్టును హెచ్ పీఐ క్రమం తప్పకుండా నివేదిస్తుంటోంది. హోటల్స్.కామ్ వెబ్ సైట్ లో బుకింగ్ ధరల ఆధారంగా ఈ రిపోర్టును తయారుచేస్తోంది. పుణే తర్వాత రాజస్తాన్ లోని జైపూర్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఒక రాత్రికి రూ.7,844లను సగటు టారిఫ్ గా జైపూర్ హోటల్ లు ఆఫర్ చేస్తున్నాయి. మలేషియా రాజధాని కౌలలాంపూర్ లో రూ.8,114లకే వసతి సదుపాయాలు లభ్యమవుతూ మూడో స్థానంలో నిలిచింది. తమిళనాడులో చెన్నైని నాలుగో స్థానం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ఐదు స్థానం వరించాయి. హైదరాబాద్ లో రాత్రి పూట హోటల్ లో ఉండటానికి భారత పర్యాటకులు రూ.8,701 చెల్లిస్తున్నారని రిపోర్టు తెలిపింది.


ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కత్తాలాంటి మొత్తం 8 మెట్రో నగరాలు భారత పర్యటకులకు తక్కువ ధరలకే ఐదు నక్షత్రాల హోటల్ లో వసతి పొందుతున్న ప్రధానమైన నగరాలుగా ఉన్నాయని రిపోర్టు పేర్కొంది. అధిక ధరలకు ఐదు నక్షత్రాల హోటల్ లో వసతి కల్పించే నగరంగా ఇటలీలోని ఫోరెన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత జపాన్ లోని టోక్యో ఉన్నట్టు పేర్కొంది. యురోపియన్ నగరాలు వెనీస్, మిలాన్, రోమ్, పారిస్ ల్లో భారత పర్యాటకలు వసతి సదుపాయాలకు అధిక మొత్తంలో చెల్లిస్తున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు