క్యూ4లో పీఎన్‌బీ నష్టం రూ.4750కోట్లు

28 May, 2019 14:42 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ( పీఎన్‌బీ) క్యూ4లో భారీ నష్టాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన మార్చి ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో రూ. 4750 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.  అయితే స్థూల నిరర్ధక ఆస్తులు గత త్రైమాసికంలో 16.33 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు కూడా రూ.12,970కోట‍్ల నుంచి రూ. 7,611 స్థాయికి దిగి వచ్చాయి. ఈ ఫలితాలపై  ఎనలిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే గత ఏడాది ఇదే త్రైమాసికం లో రూ.13,417 కోట్ల నష్టాలతో పోలిస్తే గణనీయంగా  కోలుకుంది.  వజ్రాల  వ్యాపారి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ కుంభకోణం  బ్యాంకును భారీగా నష్టపర్చింది.  మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ  షేరు నష్టాల్లో కొనసాగుతోంది.

>
మరిన్ని వార్తలు