ఆశ్చర్యపర్చిన పీఎన్‌బీ

5 Feb, 2019 13:47 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణంలో చిక్కుకున్న  ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత  ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను  ప్రకటించడంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది.  4 శాతం జంప్‌ చేసింది.

ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీఎన్‌బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి.  స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్‌పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఫ్రాడ్‌కింద రూ. 2014 కోట్లమేర ప్రొవిజన్‌ను చేపట్టినట్లు బ్యాంక్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు