పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు

5 Nov, 2019 20:45 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ  ప్రభుత్వరంగ బ్యాంకు  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఆర్థికసంవత్సరం క్యూ2లో బ్యాంక్‌ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.  సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం అధికం.మొండిబకాయిలకు రూ.2,928.90 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది. ఇదే ఏడాది క్యూ1లో రూ.2,023.31 కోట్లను మాత్రమే కేటాయించింది. గతేడాది క్యూ2లో కేటాయించిన రూ.9,757.90 కోట్లతో పోలిస్తే 70శాతం తక్కువ. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏలు 16.76శాతానికి , నికర ఎన్‌పీఏలు 7.65శాతానికి పెరిగాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఈ షేరు 5.3 శాతం తగ్గి రూ .64.60 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు