మరో బ్యాంకింగ్‌ మెర్జర్‌కు రంగం సిద్ధం

30 Apr, 2019 16:31 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా,  బ్యాంకు ఆఫ్‌ ఇండియా

సాక్షి, న్యూఢిల్లీ :  బ్యాంకింగ్  రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి  రంగం సిద్ధమవుతోంది.  బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి  ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా,  బ్యాంకు ఆఫ్‌ ఇండియా  విలీనం దిశగా  ప్రభుత్వం  అడుగులు వేస్తోంది.  ఈ మేరకు ప్రభుత్వం  బ్యాంకులతో  రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.  

తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా,  మూడవ  త్రైమాసికంలో విలీనం  ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు​ ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు  చెప్పారు.

కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి  అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత  బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు