హైదరాబాద్‌ నం 1

10 Nov, 2018 01:17 IST|Sakshi

క్యూ3 పీఈ పెట్టుబడుల్లో 60 శాతం నగరంలోనే 

రూ.11,212 కోట్లకు చేరిన పీఈ నిధులు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రూ.11,212 కోట్ల ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి. 2018 మూడు త్రైమాకాల్లో కలిపి మొత్తం రూ.37,815 కోట్లు వచ్చాయని.. ఏటా 9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. గత 11 ఏళ్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలోనే అత్యధిక పీఈ నిధులొచ్చాయి. 
∙ఈ ఏడాది క్యూ3లో అత్యధిక పీఈలను సమీకరించిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. క్యూ3లో వచ్చిన మొత్తం నిధుల్లో 60 శాతం కేవలం భాగ్యనగారికే వచ్చాయని.. 22 శాతంతో ముంబై రెండో స్థానంలో నిలిచిందని నివేదిక తెలిపింది. 

∙క్యూ3లో నగరంలో పీఈ కొనుగోళ్లలో కొన్ని.. సింగపూర్‌కు చెందిన షాండర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ గచ్చిబౌలిలో ఆఫీస్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం ఫోనిక్స్‌ గ్రూప్‌లో రూ.2,550 కోట్ల పీఈ పెట్టుబడులు పెట్టింది. అలాగే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ అండ్‌ అలయెన్జ్‌ జాయింట్‌ వెంచర్‌ 23 లక్షల చ.అ. వేవ్‌రాక్‌లో ఆఫీస్‌ పార్క్‌ ను కొనుగోలు చేసింది. 

∙మొత్తం పీఈ నిధుల్లో రూ.7,140 కోట్లు ఆఫీసు స్పేస్‌ రియల్టీలోకి వచ్చాయి. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే వృద్ధి కనపించే అవకాశాలుంటాయని.. బ్లాక్‌స్టోన్, జీఐసీ, మాప్లేట్రీ ఇన్వెస్ట్‌ మెంట్స్, సీపీపీఐబీ వంటి సంస్థలు ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోని ఆఫీస్‌ స్పేస్‌ రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. 

మరిన్ని వార్తలు