ప్రపంచంలోనే తొలి 5జీ ఫోన్‌ ఇదే..

1 Nov, 2017 07:09 IST|Sakshi

వెబ్‌ డెస్క్‌ : మొబైల్‌లో ఇంటర్నెట్‌ వాడాలంటే.. 2జీ, 3జీ  నెట్‌వర్క్‌పై ఆధారపడే రోజులు పోయాయి. ప్రస్తుతం 4జీ టెక్నాలజీతో సగటు భారతీయుడు వేగంగా సమాచారం అందుకుంటున్నాడు. అయితే, దేశవ్యాపంగా 4జీ నెట్‌వర్క్‌ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. కానీ, అప్పుడే 5జీ ఫోన్‌ సిద్ధమైపోతోంది.

2020 కల్లా 5జీ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించేశాయి. ఫొటోలో కనిపిస్తున్నది 5జీ ఫోన్‌. దీన్ని క్వాల్‌కామ్‌ అభివృద్ధి చేసింది. 5జీ టెక్నాలజీతో ఇంటర్నెట్‌ 1 జీబీ వేగంతో వస్తుంది(అంటే ఒక సెకనులో ఒక జీబీ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు). 5జీ మొబైల్‌లో క్వాల్‌కామ్‌ అభివృద్ధి చేసిన స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌50 మోడెమ్‌ చిప్‌సెట్‌ను వినియోగించింది.

వాస్తవానికి ఎక్స్‌ 50 మోడెమ్‌ చిప్‌సెట్‌ను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌ ఎప్పటినుంచో కుస్తీలు పడింది. పూర్తిగా తయారైన ప్రపంచంలోని తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను క్వాల్‌కామ్‌ ఉద్యోగి ఒకరు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు