ప్రభుత్వ రుణం @ రూ.76.94 లక్షల కోట్లు

27 Jun, 2018 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం 2017–18 జనవరి–మార్చి త్రైమాసికం అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే (అక్టోబర్‌–డిసెంబర్‌) 1.7% పెరిగింది. మొత్తంగా రూ.76.94 లక్షల కోట్లకు చేరింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన కాలానికి ఈ విలువ రూ.75.66 లక్షల కోట్లు (రూ.75,66,215 కోట్లు). రుణ నిర్వహణపై విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.

మొత్తం రుణంలో పబ్లిక్‌ డెట్‌ 88.7%గా ఉంటే, ‘పబ్లిక్‌ అకౌంట్‌’ వాటా 11.3%. పబ్లిక్‌ డెట్‌లో మార్కెట్‌ రుణాలు, స్పెషల్‌ బేరర్‌ బాండ్లు, ట్రెజరీ బిల్స్, స్పెషల్‌ లోన్స్, ఆర్‌బీఐ జారీ చేసే బాండ్లు ఉంటాయి. చెల్లించాల్సిన అంతర్జాతీయ రుణం దీనిలో ఉంటుంది. స్టేట్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్, చిన్న పొదుపులతోపాటు డిపాజిట్ల రూపం లో తీసుకున్న డబ్బు పునఃచెల్లింపులకు సంబంధించి మొత్తాలను పబ్లిక్‌ అకౌంట్‌గా వ్యవహరిస్తారు.

>
మరిన్ని వార్తలు