క్వికర్ చేతికి సలోస బ్యూటీ సంస్థ

11 May, 2016 01:38 IST|Sakshi
క్వికర్ చేతికి సలోస బ్యూటీ సంస్థ

క్వికర్ సర్వీసెస్ పటిష్టత కోసం కొనుగోళ్లు

 బెంగళూరు:  సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. తమ గృహ సేవల విభాగం, క్వికర్ సర్వీసెస్‌ను మరింత శక్తివంతం చేసుకునే  వ్యూహాంలో భాగంగా ఈ బ్యూటీ సేవల సంస్థను కొనుగోలు చేశామని క్వికర్ పేర్కొంది. క్వికర్ సర్వీసెస్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తరహా సంస్థలను కొనుగోలు చేయడం కోసం రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని క్వికర్ సర్వీసెస్ హెడ్ పీడీ సుందర్  తెలిపారు.

మరిన్ని వార్తలు