అందుకే ట్విటర్‌లో ఆబ్సెంట్‌

23 Mar, 2018 18:57 IST|Sakshi
రఘురామ్‌ రాజన్‌ (ఫైల్‌ ఫోటో)

కొచ్చి : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 2012 జనవరి నుంచి ట్విటర్‌ యాక్టివ్‌ అకౌంట్‌ ఉంది. కానీ ఈ సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌ రాజన్‌కు మాత్రం ఇప్పటి వరకు మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లేదట. అయితే తాను ఎందుకు ట్విటర్‌ అకౌంట్‌లో ఆబ్సెంట్‌గా ఉన్నారో రాజన్‌ వివరించారు. ‘నాకు సమయం లేదు. ఒకవేళ దానిలో ఎంగేజ్‌ అవ్వాలనుకుంటే, నిరంతరం దానిలో ఉనికిలో ఉండాలనేది నా అభిప్రాయం. వెంటనే ఆలోచించే సామర్థ్యం నాలో లేదు. 20 నుంచి 30 సెకన్లలో 140 క్యారెక్టర్‌ ట్వీట్‌ ద్వారా నేను స్పందించలేను’ అని రాజన్‌ చెప్పారు. కొచ్చిలో జరుగుతున్న ఫ్యూచర్‌ గ్లోబల్‌ డిజిటల్ సమిట్‌ సందర్భంగా రాజన్‌ ఈ మేరకు స్పందించారు.

ప్రస్తుతం రాజన్‌  యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ డిజిటల్‌ సమిట్లో ఆయన కీలక స్పీకర్‌. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ దీన్ని ప్రారంభించారు. ఇన్ఫోనిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని, సిస్కో హరీష్ కృష్ణన్, హార్వడ్‌ యూనివర్సిటీ గీతా గోపినాథ్‌ వంటి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.  

మరిన్ని వార్తలు