కోవిడ్‌-19 షాక్‌నకు ఆర్థిక టానిక్‌ అదే!

28 Feb, 2020 14:33 IST|Sakshi
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ (ఫైల్‌ ఫోటో)

 ఉద్దీపన చర్యలు తరువాత, ముందు వైరస్‌ను అడ్డుకోండి: రఘురామ రాజన్‌

 ప్రజలు, కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచండి!

ప్రపంచమంతా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌పై  ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ స్పందించారు. ముందు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని వ్యాఖ్యానించారు.  ఆర్థిక ఉద్దీపన చర్యల గురించి ఆందోళన చెందకుండా ఈ భయంకరమైన అంటువ్యాధిని అరికట్టేందుకు పోరాడటమే ప్రభుత్వాలు చేయగలిగే గొప్ప పని అని ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ అన్నారు. కరోనావైరస్ షాక్‌కు ఉత్తమమైన ఆర్థిక టానిక్ అదే అని ఆయన అభప్రాయడ్డారు. పరిస్థితి అదుపులోనే వుందన్న విశ్వాసాన్ని కంపెనీలకు కలిగించేందుకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు కంటే, ఆయా ప్రభుత్వాలే ఎక్కువ స్పందించి, చర్యలు చేపట్టాలని రాజన్ వెల్లడించారు.

ప్రజల ఈ వైరస్‌ను నిరోధించే చర్యల్ని కోరుకుంటున్నారని, ఈ మహమ్మారికి ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వారున్నారని పేర్కొన్నారు.  వైరస్‌పై ప్రజల భయాలు, ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక దశాబ్దం క్రితం ఆర్థిక సంక్షోభం వైపు నెట్టివేస్తోందన్నారు. గ్లోబలైజేషన్‌ ఉత్పత్తి చాలా ఘోరంగా దెబ్బతింటుందని  ఆందోళన వ్యక్తంచేశారు.  అలాగే ఒక్క వారంలో  ఈ‍క్వీటీ మార్కెట్లు ఉత్థాన పతనాలను నమోదు చేసిందంటూ గుర్తు చేశారు.

మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 2.8 శాతంగా వుండనుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఇది 2009 నాటి కంటే బలహీనమైనని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తలు గురువారం హెచ్చరించారు.

మరిన్ని వార్తలు