ఆర్థిక వ్యవస్థపై రాజన్‌ కీలక వ్యాఖ్యలు

22 May, 2020 22:07 IST|Sakshi

ముంబై: దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ ‌రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వలస కార్మికుల ఉచిత ఆహార ధాన్యాలకు సరిపోతాయని.. ఉచిత నగదు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజన్‌ స్పష్టం చేశారు. కార్మికులకు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వివిద రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే.. ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని రాజన్‌ హెచ్చరించారు.

ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రేటింగ్‌ ఏజన్సీలు ఇచ్చే నివేదికలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బ్యాంక్‌లు, సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. 
చదవండి: కోవిడ్‌-19 షాక్‌నకు ఆర్థిక టానిక్‌ అదే!

మరిన్ని వార్తలు