రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

5 Jul, 2018 15:46 IST|Sakshi
ప్రయాణికుల ఐడీ ప్రూఫ్‌గా ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ డిజిటల్‌ వెర్షన్లు

న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్‌ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఏం ఆందోళన చెందక్కర్లేదట. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ డిజిటల్‌ వెర్షన్లను ఐడీ ప్రూఫ్స్‌ అంగీకరిస్తామని దేశీయ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్‌ అందించే ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాఫ్ట్‌ కాపీలను అంగీకరిస్తుందని గురువారం ప్రకటించింది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్‌ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్‌ స్టోరేజ్‌ సర్వీసులను అందిస్తోంది. ఈ విషయంపై అన్ని జోనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను, వాలిడ్‌గా భావిస్తామని రైల్వే చెప్పింది. ‘డిజిలాకర్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయి ఇష్యూడ్‌ డాక్యుమెంట్ల సెక్షన్‌కు వెళ్లి ప్రయాణికులు ఆధార్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపిస్తే, దాన్ని వాలిడ్‌ గుర్తింపుగానే ధృవీకరించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది. సీబీఎస్‌ఈతో కూడా ఇది భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. 

మరిన్ని వార్తలు