రైల్వేలో భారీగా ఇంజనీర్‌ ఉద్యోగాలు 

2 Jan, 2019 12:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే శాఖ మరోసారి భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. దాదాపు 13వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది ముఖ్యంగా జూనియర్ ఇంజనీర్ (జెఇ), జూనియర్ ఇంజనీర్ (ఐటి), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ 13,487 పోస్టులను భర్తీ చేయనుంది. 

ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగవకాశాలను కల్పించిన రైల్వే శాఖ మరోసారి 13వేలకు పైగా ఉద్యోగులను నియమించుకుంటోదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ట్వీట్‌  చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇండియన్‌ రైల్వేస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలిపారు. 

ఖాళీల మొత్తం సంఖ్య: 13487
జూనియర్ ఇంజనీర్: 12844
జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : 29
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్: 227
కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: 387
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు ముగింపు తేదీ : జనవరి 31 

మరిన్ని వార్తలు