టాటా గ్రూపులో మరో రాజీనామా

27 May, 2017 13:03 IST|Sakshi
టాటా గ్రూపులో మరో రాజీనామా

ముంబై: ఇండియన్‌ హోటల్స్‌  (తాజ్) ఎండీ, సీఈవో రాకేష్‌ సర్నా తన పదవికి రాజీనామా చేశారు.  లైంగిక వేధింపుల ఆరోపణలు  చెలరేగిన  సుమారు రెండు సంవత్సరాల తర్వాత,  మిస్త్రీ  ఉద్వాసాన  అనంతరం  హోటల్ తాజ్ కు  రాకేష్ సర్నా గుడ్‌ బై   చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా  ఐహెచ్‌సీఎల్‌ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థల డైరెక్టర్‌ పదవికి రిజైన్‌ చేశారని  ఇండియన్ హోటల్స్ బిఎస్ఇకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

సర్నా తన మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేసినట్లు టాటా సన్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీల ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు.  సర్నా నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందనీ,  సెప్టెంబర్‌ 30 దాకా కొనసాగాలని కోరినట్టు చెప్పారు.  ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్టు  చంద్రశేఖరన్‌ తెలిపారు.

కాగా 2015లో   ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇండియన్‌ హోటల్స్‌  కంపెనీ  బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు  చేసిన  స్వతంత్ర విచారణ కమిటీ  ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.  టాటా  సన్స్‌ ఛైర్మన్‌ గా ఉద్వాసనకు గురైన టాటా  మిస్త్రీ  నియమించిన  టాటా కుటుంబానికి చెందని వ్యక్తులలో ఈయన ప్రముఖులు.  మిస్త్రీ ఉద్వాసన తరువాత ఈయన  కూడా  వైదొలగుతారని అప్పట్లో  ఊహాగానాలు  వెలువడ్డాయి. టాటా గ్రూప్ సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ  గత  ఏడాది అక్టోబర్‌ 24 న తొలగించింది. ఈ తొలగింపునకు దారి తీసిన కారణాల్లో ఇండియన్ హోటల్స్ కంపెనీ సీఈవో రాకేష్ సర్నా  వచ్చిన ఈ లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటై ఉండవచ్చునన్న వార్త గుప్పుమన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు