క్రెడాయ్‌ తెలంగాణ కొత్త కార్యవర్గం

7 Jul, 2017 23:25 IST|Sakshi
క్రెడాయ్‌ తెలంగాణ కొత్త కార్యవర్గం

సాక్షి, హైదరాబాద్‌: భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ కొత్త కార్యవర్గం ఎంపికైంది.  – 2017–19 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా గుమ్మి రాంరెడ్డి, జనరల్‌ సెక్రటరీగా చెరుకు రామచంద్రా రెడ్డిలు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏ ఆనంద్‌ రావు (కరీంనగర్‌), కొప్పు నరేష్‌ కుమార్‌ (ఖమ్మం), టీ వెంకటేశ్వర్లు (వరంగల్‌), ట్రెజరర్‌గా కే ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జీ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్‌ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం చాప్టర్లున్నాయని, రెండేళ్లలో మరో 6 చాప్టర్లను ప్రారంభించాలని లక్ష్యించామని చెప్పారు.

వచ్చే నెలలో కామారెడ్డి, మంచిర్యాలలో చాప్టర్లను ప్రారంభించనున్నామన్నారు. జిల్లాల్లో నూ జీఎస్‌టీ, రెరా వంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. జనరల్‌ సెక్రటరీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్‌ తెలంగాణలో 550 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారని.. ప్రతి పట్టణంలోనూ చాప్టర్లను తెరవనున్నట్లు చెప్పారు. నైపుణ్య అభివృద్ధి, క్లీన్‌ సిటీ వంటి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలోనూ ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు.

క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడిగా ఎస్‌ రాంరెడ్డి
క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడిగా ఎస్‌ రాంరెడ్డి, జనరల్‌ సెక్రటరీగా పీ రామకృష్ణా రావులు తిరిగి ఎంపికయ్యారు. వైస్‌ ప్రెసిడెంట్లుగా జీ ఆదిత్య, జీ ఆనంద్‌ రెడ్డి, ఎస్‌ ఆనంద్‌ రావు, డీ మురళీ కృష్ణా రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా సీజీ మురళీ మోహన్, వీ రాజశేఖర్‌ రెడ్డి, ట్రెజరర్‌గా కే రాజేశ్వర్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోందని.. అందుకే అంతర్జాతీయ కంపెనీలు నగరం వేదికగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయని ఆయన కొనియాడారు. నిర్మాణ రంగంలోని సమస్యలను తొలగించేందుకూ సంఘాలతో చర్చించడం ముదావహమని’’ చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు