ఖాజాలో రామకృష్ణ టెక్నో టవర్జ్‌

9 Dec, 2017 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్‌ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్‌ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది. 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

5 లెవల్స్‌ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్‌నెస్, లైఫ్‌ స్టయిల్‌ సెంటర్స్, ఫుడ్‌ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్‌ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్‌ వ్యూ, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని పేర్కొంది.

మరిన్ని వార్తలు