భారీ ఆర్డర్‌ దక్కించుకున్న రామ్‌కో సిస్టమ్స్‌

24 Oct, 2017 14:08 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. క్లౌడ్ ప్లాట్ఫారమ్లో ఉత్పత్తులు మరియు సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న రామ్‌కో సిస్టమ్స్  బ్రిటీష్ మల్టీనేషనల్ బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కంపెనీనుంచి మల్టీ మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ను  సాధించింది.  యూరోపియన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థ నుంచి మల్టీ మిలియన్‌ డాలర్ల పేరోల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆర్డర్ లభించినట్లు  రెగ్యురేటరీ ఫైలింగ్‌ లో రామ్‌ కో తెలిపింది. దీంతో   మిడ్‌ కాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్ రామ్కో సిస్టమ్స్ జోరందుకుంది. 11శాతం లాభాలతో కొనసాగుతోంది. ఒకదశలో దాదాపు 15 శాతానికిపైగా  ఎగిసింది.

ఆర్డర్‌లో భాగంగా యూరోపియన్‌ సంస్థ కార్యకలాపాలు విస్తరించిన 14 దేశాలలో యూనిఫైడ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మేనేజ్‌డ్‌ పేరోల్‌ సర్వీసులను నిర్వహించనున్నట్లు రామ్‌కో సిస్టమ్స్‌ పేర్కొంది. పేరోల్స్‌, పన్నులు, అటెండెన్స్‌, లీవులు, లోన్లు, రీఇంబర్స్‌మెంట్‌ తదితరాల నిర్వహణను గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా చేపట్టనున్నట్లు వివరించింది. ఇటీవలే, గ్లోబల్ పేరోల్ అసోసియేషన్  ద్వారా 2017 సం.రంలో హైలీ రికమెండెడ్‌  పేరోల్ సాఫ్ట్వేర్ సరఫరాదారు రివార్డును కూడా సొంతం చేసుకుంది.  
 

మరిన్ని వార్తలు