ఎన్‌డీటీవీనీ రాందేవ్‌ బాబా కొంటున్నారా?

5 Jun, 2017 18:27 IST|Sakshi
ఎన్‌డీటీవీనీ రాందేవ్‌ బాబా కొంటున్నారా?

ముంబై: ఒకవైపు ఎన్‌డీటీవీపై  సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో  సంచలన వార్త  చక్కర్లు కొడుతోంది.   ప్రముఖ  యోగా గురు రాందేవ్‌ బాబా ఎన్‌డీవీని కొనుగోలు చేయనున్నారనే  అంచనాలు  భారీగా నెలకొన్నాయి.   ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు  చేశాయి. అయితే  ఈవార్తలను ఎన్‌డీటీవీ  ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌,  ప్రముఖ యాంకర్‌ నిధి రాజ్దాన్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  అలాంటిదేమీ లేదని  తేల్చి చెప్పారు.  

ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం  రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది.

 కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై  వివిధ పత్రికాధిపతులు తీవ్ర  దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


 

మరిన్ని వార్తలు