భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!

23 Mar, 2017 01:22 IST|Sakshi
భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!

మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి 
కేంద్రానికి రంగరాజన్‌ సూచన

అహ్మదాబాద్‌: ‘భారత్‌లో తయారీ’ ఆలోచన పాతదేనని, ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ కేంద్రానికి సూచించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలన్న ఉద్దేశంతో మేకిన్‌ ఇండియా (బారత్‌లో తయారీ) పేరుతో మోదీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గానూ పనిచేసిన రంగరాజన్‌ ఈ అంశంపై  అహ్మదాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు