డీమార్ట్‌లో ధరలు ఎందుకు పెరిగాయంటే..

25 May, 2020 19:00 IST|Sakshi

ముంబై: దేశంలోని వినియోగదారులను విశేషంగా ఆకర్శించిన సూప‌ర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రస్తుతం కరోనా ఉదృతి కారణంగా డీలా పడింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నియమాలను పాటిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా స్టోర్‌లను శుభ్రంగా ఉంచేందుకు సంస్థకు చాలా ఖర్చు అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కారణంగానే వస్తువుల ధరలు కూడా పెంచామని తెలిపారు. వినియోగదారులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా ఆలోచించాలని సంస్థ కోరింది. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి సంస్థ అమ్మకాల వృద్ధి 11 శాతం తగ్గగా ఏప్రిల్‌ నెలలో ఏకంగా 45శాతం ఆదాయం కోల్పోయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఏప్రిల్‌లో అమ్మకాల వృద్ధి గణనీయంగా తగ్గడానికి లాక్‌డౌన్‌ కారణమని సంస్థ సీనియర్‌ ఉద్యోగులు అభిపప్రాయపడ్ఢారు. ఈ సంక్షోభ సమయంలో సంస్థ ఆదాయాలను పెంచుకోవడానికి హోం డెలివరీని సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. కాగా ఖర్చులను హేతుబద్దీకరించి ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తే లాభాల బాట పట్టడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంవత్సరంలో 38 నూతన స్టోర్లనను తెరవనున్నామని.. తమ సంస్థకు రూ.3500కోట్లు మూలధనం ఉందని, ఎలాంటి సంక్షోభానైనా ఎదుర్కొనే సత్తా డీమార్ట్‌కు ఉం‍దని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

చదవండి: ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌ను సీజ్‌ చేసిన అధికారులు

మరిన్ని వార్తలు