ఎన్‌ఎస్‌ఈకీ రవి నారాయన్‌ రాజీనామా

2 Jun, 2017 12:02 IST|Sakshi
ఎన్‌ఎస్‌ఈకీ రవి నారాయన్‌ రాజీనామా

ముంబై:  దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ నిర్వహణ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్‌ఎస్‌ఈ)  రవి నారాయన్‌ గుడ్‌ బై చెప్పారు. అతిపెద్ద ఈక్విటీసంస్థ ఎన్‌ఎస్‌ఈ   ఇండియాకు  నాంది పలికిన ముఖ్యుల్లో ఒకరైన రవినారాయణ ఎన్‌ఎస్‌ఈ  పదవికి రాజీనామా చేశారు.  ఇటీవలి సెబీ  షోకాజ్‌ నోటీసుల  నేపథ్యంలో ఆయన  ఎన్‌ఎస్‌ఈ వైస్‌ ఛైర్మన్‌ పదవికి,  బోర్డుకు గుడ్‌ బై  చెప్పారు.  గత రాత్రి ఈ నిర్ణయం తీసుకున్న రవి నారాయణ ఈ మేరకు  ఎన్‌ఎస్‌ఈ  బోర్డుకు సమాచారం అందించారు.   ఇటీవల వివాదం  సెబీ విచారణ నేపథ‍్యంలో   ఆయన ఎన్‌ఎస్‌ఈ బోర్డుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో సుదీర్ఘ కాలంపాటు సంస్థ కు సేవలందించిన రవినారాయణ్‌ శకం ముగిసినట్టయింది.

ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌ కుంభకోణం కేసుపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో రవి నారాయణ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు  తెలుస్తోంది.  ఆల్గో స్కామ్‌ దర్యాప్తు నిజాయితీగా.. పారదర్శకంగా జరిగేందుకే నారాయణ్‌ తప్పుకున్నట్లు ఎక్స్ఛేంజీ వర్గాలు తెలిపాయి. ఆల్గో స్కామ్‌ విచారణలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జూన్‌ 1న నారాయన్‌కు షోకాజ్‌ నోటీసులిచ్చింది. మరోవైపు రవి నారాయణ  నిర్ణయం, మంచి నిర్ణయమని  ఎనలిస్టులు  అభిప్రాయపడుతున్నారు.
కాగా గత ఏడాది డిశెంబర్‌లో ఎన్‌ఎస్‌ఈఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణ అనూహ్యమైన పరిస్థితుల్లో వైదొలిగిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు