ఆర్‌బీఐ చీఫ్‌ ‘పాలసీ’ చర్చలు...

26 Mar, 2019 00:00 IST|Sakshi

ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశం..

ఏప్రిల్‌ 2 నుంచీ పాలసీ సమీక్ష నేపథ్యం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ సోమవారం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏప్రిల్‌ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనున్న రానున్న ఆర్థిక సంవత్సరం (2019–2020) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష తత్సంబంధ అంశాలపై వీరిరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఒక మర్యాదపూర్వక సమావేశం. ద్రవ్య విధాన సమీక్ష ముందు ఆర్థికమంత్రితో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ సాంప్రదాయకంగా వస్తోంది’’ అని ఈ సమావేశం తరువాత దాస్‌ విలేకరులతో అన్నారు. ఏప్రిల్‌ 11 నుంచీ ఏడు దశల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరగనున్న ఆర్‌బీఐ పరపతి సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గుతుందా? లేదా అన్న అంశంపై ప్రస్తుతం అందరిదృష్టీ కేంద్రీకృతమైంది. అయితే ఈ దఫా రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, ఇప్పటికే తగ్గించిన రేటు ప్రయోజనం కస్టమర్లకు అందడంపైనే ఆర్‌బీఐ ప్రస్తుతానికి దృష్టి సారించవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిపిన విషయం గమనార్హం.  

పేమెంట్స్‌ బ్యాంక్స్‌ చీఫ్‌లతో త్వరలో... 
కాగా ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ వారం చివర్లో పేమెంట్స్‌ బ్యాంక్స్‌ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. నీతీ ఆయోగ్‌ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఆర్థికరంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న భాగస్వాములందరితో భేటీఅవుతున్నాను. సమస్యలను తెలుసుకుంటున్నాను. అభివృద్ధికి సంబంధించి వ్యవస్థలో లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నాను. ఇందులో భాగంగా బ్యాంకులు, కార్పొరేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యాను. ఈ వారంలో పేమెంట్‌ బ్యాంక్‌ చీఫ్‌లతో కూడా సమావేశం కానున్నాను’’ అని దాస్‌ పేర్కొన్నారు.
 
ఆహార ధరలు పెరుగుతాయ్‌: గోల్డ్‌మన్‌ శాక్స్‌ 
కాగా ఆహార ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనావేస్తోంది.  ఆహార ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల స్పీడ్‌) 2017 ఏప్రిల్‌–2018 మార్చితో పోల్చితే 2018–19 ఇదే కాలంలో సగటున కేవలం 0.7 శాతం పెరిగిందని పేర్కొన్న గోల్డ్‌మన్‌ శాక్స్,  2019–20లో ఈ రేటు 2 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు దీనికి ఒక కారణంగా విశ్లేషించింది. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు తక్కువ ధర పలుకుతోందని రైతులు ఆందోళన చేస్తున్నారని, అధిక రిటర్న్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారని  పేర్కొన్న బ్రోకరేజ్‌ సంస్థ, ఆయా పరిణామాలు రానున్న కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు మ రో కారణమవుతుందనీ వివరించింది. రైతులకు తగి న ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం కూడా హామీ ఇస్తున్న విషయాన్ని తన నివేదికలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రస్తావించింది.  

ద్రవ్య లభ్యత పరిస్థితి బాగుంది: గార్గ్‌
ఇదిలావుండగా, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి బాగుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు.  కొత్త విధానం... రూపీ–డాలర్‌  మార్గం ద్వారా వ్యవస్థలోకి ఆర్‌బీఐ మరో రూ.35,000 కోట్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇందుకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితికిగాను 5 బిలియన్‌ డాలర్లకు గురువారం వేలం జరగనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.   వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!