నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిందే..

1 Jan, 2020 03:55 IST|Sakshi

అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బీవోఎం)ను ఏడాదిలోపు ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌బీఐ ఆదేశించింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.  నిర్వహణను పర్యవేక్షించేందుకు నిపుణుల కలయికతో బీవోఎం ఉండాలని ఆర్‌బీఐ పేర్కొంది. డైరెక్టర్ల బోర్డుకు ఇది అదనం. పీఎంసీ బ్యాంకు  సంక్షోభం కారణంగా 9 లక్షల మంది డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తదనంతరం కోపరేటివ్‌ బ్యాంకుల నిర్వహణకు సంబంధించి ఆర్‌బీఐ పలు దిద్దుబాటు చర్యలను అమల్లోకి తీసుకొస్తోంది. ‘‘అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ప్రజల డిపాజిట్లను స్వీకరిస్తున్నందున, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్‌బీఐ పేర్కొంది. అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకుల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలను బీవోఎం పర్యవేక్షిస్తూ, సరైన నిర్వహణ దిశగా డైరెక్టర్ల బోర్డుకు సాయం అందిస్తుందని తెలిపింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు