లిక్విడిటీ బూస్ట్‌ : మార్కెట్ల హై జంప్‌

29 Oct, 2018 14:13 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు పదర్శిస్తున్నాయి.తొలుత కొన్నినిముషాలపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ  తరువాత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌550 పాయింట్లు జంప్‌చేసి 33,922వద్ద నిఫ్టీ 150 పాయింట్ల ఎగసి 10,180 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌బీఐ ఇచ్చిన  లిక్వడిటీ బూస్టప్‌తోపీఎస్‌యూ బ్యాంక్స్‌  జోరుగా ఉన్నాయి.  ఓపెన్‌మార్కెట్‌  ద్వారా రూ. 40వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటన రుపీ, బాండ్‌,  ఈక్విటీ మార్కె‍ట్లకు జోష్‌నిచ్చింది.  ముఖ్యంగా ఎస్‌యూ బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 6.6 శాతం దూసుకెళ్లింది. అలాగే  ఫార్మా 4.5 శాతం జంప్‌చేసింది. రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో, ఐటీ షేర్లు  సహా ఇమిగతా అన్ని రంగాలూ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 


ఐసీఐసీఐ 10శాతం ఎగిసి బ్యాంకింగ్‌ సెక్టార్‌లో టాప్‌  విన్నర్‌గా ఉంది. ఓబీసీ,యూనియన్‌, కెనరా, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌, పీఎన్‌బీ, బీవోబీ, ఎస్‌బీఐ,  విజయా, సెంట్రల్‌ బ్యాంక్‌  భారీలా లాభపడుతున్నాయి. ఇక ఫార్మా కౌంటర్లలోనూ దివీస్‌ 14 శాతం దూసుకెళ్లగా.. అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సిప్లా, సన్ ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్, బయోకాన్‌, గ్లెన్‌మార్క్‌ కూడా ఇదే బాటలో ఉన్నాయి. అలాగే రియల్టీ షేర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, సన్‌టెక్‌, ఇండియాబుల్స్‌  మెరుపులు మెరిపిస్తున్నాయి. మరోవైపు  జెట్‌ ఎయిర్‌వేస్‌, హెక్సావేర్, ఇన్ఫీబీమ్‌, భారత్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌, దాల్మియా భారత్‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అటు రూపీ కూడా డాలరు మారకంలో లాభాలతో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు