మున్ముందు మరిన్ని రేటు కోతలు! 

23 Feb, 2019 01:18 IST|Sakshi

ఎంపీసీ మినిట్స్‌పై విశ్లేషకుల అంచనాలు  

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మున్ముందు మరిన్ని రేటు కోత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తాజాగా విడుదలైన మినిట్స్‌ సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకూ జరిపిన విధాన సమీక్ష, నిర్ణయాలపై గురువారం ఆర్‌బీఐ మినిట్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటు  (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 6.50 శాతం నుంచి 6.25 శాగానికి తగ్గించింది.

వృద్ధి మందగమనం, తక్కువగా ఉన్న ధరల స్పీడ్‌ నేపథ్యంలో వృద్ధి స్పీడ్‌కు రేటు తగ్గింపు సరైన నిర్ణయమని ఎంపీసీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడిన విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనితోపాటు గురువారం నాడు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రేటు తగ్గింపు అవసరాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేయడాన్నీ వీరు ప్రస్తావిస్తున్నారు.    

మరిన్ని వార్తలు