తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్‌బీఐ

4 Sep, 2018 00:57 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) 2017–18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి (ఆర్‌బీఐ అకౌంటింగ్‌ సంవత్సరం జూ లై నుంచి జూన్‌ వరకు) ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వ లు 566.23 టన్నులకు చేరాయి.

2017 జూన్‌ నాటి కి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివ రి సారిగా 2009లో ఆర్‌బీఐ 200 టన్నుల బంగా రాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం వల్లే గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం నిల్వలు పెంచుకునేందుకు దారితీసినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలియజేస్తోంది.

మరిన్ని వార్తలు