ఆర్‌బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత

4 Oct, 2019 11:59 IST|Sakshi

కీలక వడ్డీరేటు కోత, 2010 స్థాయికి రెపో రేటు 

రెపో రేటు 5.15 శాతం

రివర్స్‌ రెపో రేటు  4.9శాతం

సాక్షి, ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ మరోసారి రేట్‌ కట్‌కే మొగ్గు చూపింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి నాలుగవ ద్వి-నెలవారీ ద్రవ్య విధానాన్ని నేడు (శుక్రవారం, అక్టోబర్‌ 4 ) తన సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 25 బీపీఎస్‌ పాయింట్ల  మేర తగ్గించింది.  ఏకగ్రీవంగా కమిటీ  ఈ రేట్‌ కట్‌కు నిర్ణయించింది.  కాగా  ఈ ఏడాదిలో ఇది ఐదవ రేటు కట్‌. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది.  దీంతో  రెపోరేట్‌ 2010 నాటికి చేరింది. ఇక  రివర్స్‌ రెపో రేటును  4.9శాతంగా ఉంచింది. జీడీపీ వృద్ధిరేటును 6.9 నుంచి 6.1 నుంచి  తగ్గించింది. అలాగే 2020-21 నాటికి జీడీపీ అంచనాను కోత పెట్టి 7.2 శాతంగా  ఆర్‌బీఐ నిర్ణయించింది. 

సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే రెపో రేటును వరుసగా నాలుగుసార్లు తగ్గించింది, ఈ ఏడాది మొత్తం 110 బేసిస్ పాయింట్లు. ఆగస్టులో జరిగిన చివరి సమావేశంలో, ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) బెంచ్మార్క్ రుణ రేటును అసాధారణమైన 35 బేసిస్ పాయింట్ల ద్వారా 5.40 శాతానికి తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం(0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే.  రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది.  ఈ క్రమంలో చాలామంది ఎనలిస్టులు 40 పాయింట్ల  రేట్‌ కట్‌ను ఊహించారు.   తాజా రివ్యూలో ఎంపీసీ లో  ఒక సభ్యుడుకూడా 40శాతం కోతకు ఓటు వేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు