మేమెప్పుడూ మీ వివరాలు అడగం: ఆర్బీఐ

10 Nov, 2016 00:56 IST|Sakshi
మేమెప్పుడూ మీ వివరాలు అడగం: ఆర్బీఐ

మోసపూరిత ఈ-మెరుుల్స్‌తో జాగ్రత్త 

 హైదరాబాద్: ప్రజలను తామెప్పుడూ బ్యాంక్ అకౌంట్, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలను అడగబోమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వివరాల కోసం తాము ప్రజలకు ఎలాంటి ఈ-మెరుుల్స్, ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్ చేయమని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు మోసపూరిత ఈ-మెరుుల్స్, కాల్స్, ఎస్‌ఎంఎస్ పట్ల అవగాహనతో ఉండాలని సూచించింది. ఇవి ఒక్కొక్కసారి ఆర్‌బీఐ నుంచి వచ్చిన ఈ-మెరుుల్స్, ఎస్‌ఎంఎస్‌లు లాగే ఉంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలని, వాటికి రెస్పాండ్ కావొద్దని విజ్ఞప్తి చేసింది. తామెప్పుడూ ఎవరికీ డబ్బుల్ని ఆఫర్ చేయమని పేర్కొంది. 

మరిన్ని వార్తలు