17 బ్యాంకులపై ఆర్‌బీఐ నియంత్రణలు!!

11 May, 2017 03:17 IST|Sakshi

ఐడీబీఐ తరహాలో వీటిపైనా నియంత్రణలకు అవకాశం: ఇక్రా
న్యూఢిల్లీ: ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రభుత్వరంగ బ్యాంకులు ఐడీబీఐ బ్యాంకు తరహాలో ఆర్‌బీఐ నియంత్రణలను ఎదుర్కొనే అవకాశం ఉందని రేటింగ్‌ సంస్థ ఇక్రా పేర్కొంది. ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటూ నికర ఎన్‌పీఏలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు తాజాగా ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తాజా మూలధనాన్ని సర్దుబాటు చేయడం, శాఖల విస్తరణ, రుణాల మంజూరు, డైరెక్టర్ల ఫీజులు, డివిడెండ్‌ పంపిణీ వంటి పలు అంశాలపై నియంత్రణా చర్యలు విధించే అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది. ఐవోబీ, యూకో, పీఎన్‌బీ, ఓబీసీ, యూబీఐ, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, దేనా బ్యాంకుల ఎన్‌పీఏలు ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ట మార్కును దాటేశాయి.

మరిన్ని వార్తలు