1న వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు!

31 Oct, 2018 00:27 IST|Sakshi

ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్‌1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది.  పండుగల సీజన్‌ ఫండ్స్‌ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్‌ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు