మరింత దిగిరానున్నగృహరుణ వడ్డీ రేట్లు

7 Jun, 2017 17:01 IST|Sakshi
మరింత దిగిరానున్నగృహరుణ వడ్డీ రేట్లు

2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)  రెండవ ద్వితీయ  ద్రవ్య విధాన సమీక్షలో యథాతధ వడ్డీరేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది.   ఆర్‌బీఐ  గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం  ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది.   రివర్స్‌,  రెపో రేట్లను స్టేటస్‌ కో వ్యూహాన్ని అనుసరిచింది.  చాలామంది ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు కనుగుణంగానే ఆర్‌బీఐ  అనుసరించిన విధానంతో గృహరుణాల రేట్లు దిగారానున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఎస్ఎల్ఆర్లో కట్ బ్యాంకింగ్ పరిశ్రమకు సానుకూలంగా ఉందనీ, ఇది మరింత ద్రవ్యత్వాన్ని అందిస్తుందని ఎనలిస్టుల అంచనా. ఫలితంగా గృహరుణాలు మరింత దిగిరానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.

మానిటరీ పాలసీ కమిటీ  రెపో రేటును 6.25, రివర్స్‌రెపోను 6శాతం, సుప్రీం బ్యాంక్ లీటరి లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) ను 50 బీపీఎస్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో కచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత ద్రవ్యం రానుంది. దీంతో హోం లోన్లు మరింత చౌకగా లభించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అధిక ద్రవ్యతతో, కొంతమంది బ్యాంకులు ముందుకొచ్చే బిట్లను తగ్గించవచ్చని చెప్పారు.మానిటరీ పాలసీ కమిటీ  వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి నిర్ణయించడంతో  ఎస్‌ఎల్‌ఆర్ 50 బేసిస్ పాయింట్లు  తగ్గింపును ఊహించలేదని ఎనలిస్టులు చెప్పారు.  ఫలితంగా  బ్యాంకులు ఖాతాదారులకు  తక్కువ రేటులో ఎక్కువ రుణా లివ్వగలిగే  ద్రవ్యనిధులను కలిగి ఉంటాయని చెప్పారు.  క్రెడిట్ ఆఫ్ తీసుకోవడం కూడా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రొవిజనింగ్ అవసరాలు తగ్గిపోతుండటం వలన హౌసింగ్ రుణాలు ఖచ్చితంగా చౌకగా లభించనున్నాయని ఇన్వెస్టాప్ షాప్ప్ ఇండియా లిమిటెడ్ సీఈఓ ఆశిష్ కపూర్ తెలిపారు. అయితే మార్జిన్ ఒత్తిడి వంటి, ఎన్‌పీఐ రిజల్యూషన్ తదితరకారణాల రీత్యా  పారిశ్రామిక రుణాలు చౌకగా లభించవనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఆర్‌బీఐ తదుపరి  పాలసీ రివ్యూ  ఆగష్టులో జరుగనుంది.  ప్రధానంగా జీఎస్‌టీ,  రుతుపవనాలపై  ఆర్‌బీఐ దృష్టి కొనసాగనుంది. ఏదైనా సానుకూల సూచికలు అందితే తప్ప ఆర్బీఐ కొన్ని నెలలు రిపో రేటు ప్రస్తుత వైఖరినే కొనసాగించనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు  ఇంటిని కొనడానికి చూస్తున్న వారు ముందుకు సాగవచ్చనీ,   గృహ రుణాన్ని  తీసుకోవడానికి ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు.  

కాగా డిమానిటైజేషన్‌  అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు హోం లోన్లపై విధించే ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను ఇప్పటికే గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే.



 

మరిన్ని వార్తలు