అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

3 Jan, 2020 08:12 IST|Sakshi

మనీ యాప్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్‌ ఎడెడ్‌ నోట్‌ ఐడెంటిఫయర్‌ (ఎంఏఎన్‌ఐ–మనీ) యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ‘కలర్‌ బ్‌లైండ్‌నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా ఇండియన్‌ కరెన్సీ నోట్లలో ఇంటాగ్లియో ప్రింటింగ్, స్పర్శ, నోట్ల పరిమాణం, సంఖ్యలు, ఏక వర్ణ రంగులు, నమూనాలు’ వంటివి ఉన్నాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

యాప్‌ ఎలా పని చేస్తుందంటే?
యాప్‌లోని కెమెరాను ఆన్‌ చేసి నోట్ల మీద ఉంచగానే ఈ యాప్‌ కరెన్సీ నోట్ల మీద ఉండే మహాత్మా గాంధీ బొమ్మను, సిరీస్‌ను లేదా వెనక వైపున ఉండే నోట్‌ భాగాన్ని గుర్తిస్తుంది. నోట్‌ విలువ ఎంతనేది హిందీ, ఇంగ్లీష్‌ భాషలో ఆడియో ద్వారా తెలుపుతుంది. వినికిడి సమస్య ఉన్న వాళ్ల కోసం వైబ్రేషన్స్‌ ద్వారా కూడా చెబుతుంది. ఈ యాప్‌ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా పని చేస్తుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ ఆఫ్‌లైన్‌లో, వాయిస్‌ ఆధారిత అపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా కూడా పని చేయటం ఈ యాప్‌ ప్రత్యేకతలు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా