రేటు పావుశాతం పెరగొచ్చు: కేర్‌ రేటింగ్స్‌

10 Mar, 2018 01:40 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) 2018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.

ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్‌ తన నివేదికలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు