మారిటోయం పొడగింపు ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలమే: ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్స్‌

23 May, 2020 09:50 IST|Sakshi

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం

టర్మ్‌లోన్లపై ఈఎంఐ మరో 3నెలల పొడగింపు నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రతికూలమని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఇదే సమయంలో మారిటోరియం పొడగింపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) దృష్ట్యా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్ని రకాల టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

‘‘మారిటోరియం పొడగింపు.. వసూళ్లు, రికవరీ విధానాన్ని మరింత ఆలస్యం చేస్తుంది. లిక్విడిటీ సైకిల్‌కు విస్తరించి ప్రతిబంధకంగా మారుతుంది. అన్ని రంగాల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న స్థాయి రుణదాతలు, మైక్రో ఫైనాన్స్ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది.’’ అని ఎంకే గ్లోబల్‌ తమ నివేదికలో తెలిపింది.

అయితే రెపోరేటు 40 బేసిన్‌ పాయింట్ల కోత విధింపు ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసొచ్చే అంశమేనని ఎంకే గ్లోబల్‌ తెలిపింది. బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల కోసం మారటోరియం పొడిగింపుపై ఇంకా స్పష్టత లేదని అనే అంశాన్ని ఈ సందర్భంగా బ్రోకరేజ్‌ సంస్థ గుర్తుచేసింది. 

పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకోకుండా దూరంగా ఉన్నాయని అయితే ఇప్పుడు ఆర్‌బీఐ ప్రకటనతో వారు వైఖరిని మార్చాల్సిన అవసరం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ వివరించింది.  31 తో ముగుస్తున్న అసెట్‌ రీక్లాసిఫికేషన్‌ నిలిపివేతపై స్పష్టత లేకపోవడంపై మరో ఆందోళన తెరపైకి వచ్చినట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

ఆస్తి ఫైనాన్స్ కంపెనీలతో (ఏఎఫ్‌సి) పోల్చితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సి) మెరుగ్గా ఉన్నాయని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అయితే అన్ని రంగాలు స్వల్ప కాలం పాటు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జజాజ్‌ ఫైనాన్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌&ఫైనాన్స్‌ కంపెనీ, అండ్‌ ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌లు కొద్దిగా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉందని ఎంకే బ్రోకరేజ్‌ తన నివేదికలో పేర్కోంది.

మరిన్ని వార్తలు