ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో?

18 Mar, 2019 05:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్‌బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్‌ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్‌బీఐతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల అనుమతి కూడా అవసరం అవుతుంది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను జనవరిలో ఎల్‌ఐసీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో 60 ఏళ్లకు పైగా బీమా రంగంలో ఉన్న ఎల్‌ఐసీ ఎట్టకేలకు బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టినట్టు అయింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు