ఆర్‌బీఐ పాలసీ రివ్యూ : వడ్డీరేట్లు యథాతథం

5 Dec, 2018 14:11 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  తనకీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే  ఆర్‌బీఐ నేడు (డిసెంబరు 5)న నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు  6.5శాతంగాను,  రివర్స్‌ రెపో6.25శాతంగా ఉండనుంది. అయితే ఎస్‌ఎల్‌ ఆర్‌ రేటులో 25 బేసిస్‌ పాయింట్లు కోత  పెట్టింది.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది.  ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్‌ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు