రద్దయిన కరెన్సీ : బ్యాంకులకు చేరిన మొత్తమిదే..

29 Aug, 2018 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్‌ 2016లో రాత్రికి రాత్రి రద్దయిన రూ 500, రూ 1000 నోట్లలో 99.3 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకులకు చేరుకుందని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న రూ 15.41 లక్షల కోట్ల విలువైన రూ 500, రూ 1000 నోట్లలో రూ 15.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ బ్యాంకులకు చేరుకుందని ఆర్‌బీఐ తెలిపింది.

రద్దయిన పాత నోట్ల ప్రాసెసింగ్‌, తనిఖీ ప్రకియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. బ్యాంకులకు చేరిన స్పెసిఫైడ్‌ బ్యాంక్‌ నోట్ల (ఎస్‌బీఎన్‌)ను హైస్పీడ్‌ కరెన్సీ వెరిఫికేషన్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థ (సీవీపీఎస్‌)లో తనిఖీ, లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మరోవైపు బ్యాంకులకు చేరిన పాత నోట్లు దాదాపు రద్దయిన కరెన్సీ నోట్లకు సమానంగా ఉండటంతో నోట్ల రద్దు ప్రయోజనాలపై విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు