ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో!!

21 Mar, 2019 00:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో పేరు మార్పునకు అనుమతించాలన్న ఐడీబీఐ బ్యాంకు విజ్ఞప్తిని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తోసిపుచ్చింది. దీంతో బ్యాంకు ఇకపైనా అదే పేరుతో కొనసాగనుంది. ఐడీబీఐ బ్యాంకు బుధవారం స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఈ విషయాలు తెలియజేసింది. అయితే, పేరు మార్పును ఆర్‌బీఐ తిరస్కరించడానికి గల కారణాలను వివరించలేదు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌  (ఎల్‌ఐసీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ డీల్‌తో బ్యాంకులో ప్రభుత్వ వాటా 46.46 శాతానికి తగ్గగా.. ఎల్‌ఐసీ వాటా 8% నుంచి 51 శాతానికి పెరిగింది. దీంతో ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్‌ బ్యాంకుగా వర్గీకరిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకు లేదా ఎల్‌ఐసీ బ్యాంకుగా పేరును మార్చుకునేందుకు అనుమతించాలంటూ ఐడీబీఐ బ్యాంకు బోర్డు గత నెలలో ఆర్‌బీఐని కోరింది. ఈ ప్రతిపాదననే రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా తిరస్కరించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా