రిజర్వు బ్యాంకు వెనక్కి తగ్గింది..ఎందుకంటే!

22 Aug, 2014 16:01 IST|Sakshi
రిజర్వు బ్యాంకు వెనక్కి తగ్గింది..ఎందుకంటే!
గత కొద్దికాలంగా అమెరికా డాలర్ కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కితగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడమే అందుకు కారణమని ఆర్ధిక రంగ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి-జూలై నెలల మధ్యకాలంలో రిజర్వు బ్యాంక్ నిల్వలు 26 బిలియన్ల మేరకు పెరిగినట్టు తెలిసింది. జూలై మాసాంతానికి 317.80 డాలర్లకు చేరుకుందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. 
 
మెరుగైన కాపిటల్ అవుట్ ఫ్లో కోసం సాధారణంగా స్పాట్ మార్కెట్ లో డాలర్ ను కొనుగోలు చేసి.. ఫార్వర్డు మార్కెట్ కు రిజర్వు బ్యాంక్ మళ్లింపు చేస్తుంది. భవిష్యత్ లో తలెత్తే అసాధారణ పరిస్థుతులను తట్టుకునేందుకు ఫార్వర్డు మార్కెట్ నిధిని రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఫార్వర్డు మార్కెట్ నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో డాలర్ కొనుగోలును రిజర్వు బ్యాంక్ ఆపివేయడానికి కారణమైందని విశ్లేషకులు వెల్లడించారు. 
మరిన్ని వార్తలు